/rtv/media/media_files/2025/10/18/k-ramp-viral-video-2025-10-18-15-42-53.jpg)
K-RAMP viral video
K-RAMP: 'క' బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కే- ర్యాంప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్ వీడియో షేర్ చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ''అందరికీ చాలా ధన్యవాదాలు.. మీరు మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ తో థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారు, గోల పెడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ చూసి నేను, మా టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. పండగపూట మీ అందరూ ఫ్యామిలీస్ తో వెళ్లి నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. కొంతమంది ఫస్ట్ బాగుంది, సెకండ్ ఆఫ్ అదిరిపోయింది అంటున్నారు.. మరికొంతమంది ఫస్ట్ ఆఫ్ పర్లేదు, సెకండ్ ఆఫ్ బాగుంది అంటున్నారు. ఏదేమైనా మీరందరూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడిన అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు'' అని తెలిపారు.
''గతంలో ఎస్. ఆర్ కల్యాణ మండపం విషయంలో కూడా ఇలాంటి విజయాన్నే అందించారు. మ్యాట్నీ, మార్నింగ్ షోలు పడగానే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు 'కే- ర్యాంప్' విషయంలో కూడా అదే సక్సెస్ అందించారు'' అంటూ వీడియో షేర్ చేశారు.
Thank you all ❤️🙏#KRamppic.twitter.com/VuaKukR50F
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2025
ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం
జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం తన ఎనర్జీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాలోని కామెడీ కొంతమేర ప్రేక్షకులను మెప్పించగా.. మరికొంతమంది తీవ్రంగా విమర్శించారు. ఆశించిన స్థాయిలో కామెడీ లేదని, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో కిరణ్ అబ్బవరం వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయించాయి. ఈ చిత్రంలో హీరో ఏ బాధ్యత లేకుండా గాలికి తిరిగే కుర్రాడిగా కనిపించాడు. ఈ క్రమంలో అతడి కాలేజీ లైఫ్, లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనే దాని చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
ఇందులో యంగ్ బ్యూటీ యుక్తీ తరేజా కథానాయికగా నటించింది. సినిమాలో కొన్ని చోట్ల వీరిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్, పాటలు కూడా బాగున్నాయి.
Also Read: Bigg Boss 9: పచ్చళ్ళ పాప దుమ్ముదులిపిన నాగ్ మామ.. డెమోన్, రీతూ లవ్ స్టోరీ షాకింగ్ వీడియో!