Bigg Boss 9: పచ్చళ్ళ పాప దుమ్ముదులిపిన నాగ్ మామ.. డెమోన్, రీతూ లవ్ స్టోరీ షాకింగ్ వీడియో!

బిగ్ బాస్ 9 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారం చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్స్ దుమ్ముదులిపారు.  అలాగే బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న గాసిప్పులు, లవ్ స్టోరీలకు సంబంధించిన కొన్ని సీక్రెట్ వీడియోలను బయట పెట్టారు.

New Update

Bigg Boss 9: బిగ్ బాస్ 9 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారం చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్స్ దుమ్ముదులిపారు.  అలాగే బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న గాసిప్పులు, లవ్ స్టోరీలకు సంబంధించిన కొన్ని సీక్రెట్ వీడియోలను బయట పెట్టారు. పచ్చళ్ళ పాప కళ్యాణ్ ని.. ''అమ్మాయిల పిచ్చోడు'' అనడంపై ఫైర్ అయ్యారు. కళ్యాణ, రమ్య మోక్ష ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి దీనికి సంబంధించిన వీడియోను ప్లే చేశారు. దీంతో పచ్చళ్ళ పాప దెబ్బకు నోరెళ్లబెట్టింది. ఇంక కళ్యాణ్ కి దిమ్మతిరిగింది. ఒక అబ్బాయి గురించి పూర్తిగా తెలియకుండా అలాంటి స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేస్తావమ్మా అంటూ రమ్యను ప్రశ్నించారు. తలపై కిరీటం ఉంటే రాణి అయిపోరు.. దానికి తగ్గట్లుగా మాట తీరు ఉండాలి అంటూ కడిగిపారేశారు నాగ్ మామ. 

Also Read: Aditi Rao Hydari: అబ్బా.. అచ్చం బార్బీనే! 46 ఏళ్ళ వయసులోనూ ఇంత అందమేంటి రా బాబూ

Advertisment
తాజా కథనాలు