Katrina- Vicky: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా - విక్కీ! బేబీ బంప్ ఫొటో రివీల్

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు కొద్దిరోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయాన్ని తామే స్వయంగా ప్రకటించారు కత్రినా- విక్కీ

New Update
katrina kaif pregnancy

katrina kaif pregnancy

Katrina- Vicky: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు కొద్దిరోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో  తాజాగా ఈ విషయాన్ని తామే స్వయంగా ప్రకటించారు కత్రినా- విక్కీ జంట. ఇన్ స్టాగ్రామ్ వేదికగా  తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే  గుడ్ న్యూస్ పంచుకున్నారు. కత్రినా బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..  ''ఆనందం,  కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా  జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము అని తెలిపారు. దీంతో కత్రినా- విక్కీ జంటకు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు కావాలనే కత్రినా తన ప్రెగ్నెన్సీ విషయంలో ప్రైవసీ మెంటేన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఇంతలోనే ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండడంతో.. తామే స్వయంగా ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్ కత్రినా- విక్కీ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

2021లో వివాహం 

ఇదిలా కత్రినా- విక్కీ 2021లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అతి కొద్దిమంది బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు విక్కీ జంట. ఇక  విక్కీ- కత్రినా సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత కూడా ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. విక్కీ కౌశల్ గతేడాది  పీరియాడిక్ డ్రామా  'చావా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం  రూ. 750 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాదు 2023లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక కత్రినా 2023లో విజయ్ సేతుపతి సరసన  'మేరీ క్రిస్మస్'  సినిమాలో మెరిసింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ జంట. తరచూ వెకేషన్, ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. 

Also Read: Mohanlal: మోహన్ లాల్ కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'.. స్టేడియం అంతా స్టాండింగ్ ఒవేషన్! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు