Kartik Aaryan: ఐదోసారి జతకడుతున్న సూపర్ హిట్ కాంబో... కమింగ్ సూన్..!

కార్తిక్ ఆర్యన్, లవ్ రంజన్ ఐదోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. ‘సోను కే టిటూ కీ స్వీటీ’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. సరైన కథ కోసం ఏడేళ్లుగా ఎదురు చూశారు. ఈ సినిమాలో కార్తిక్ సరసన అలియా భట్ నటించే అవకాశం ఉంది.

New Update
Kartik Aaryan

Kartik Aaryan

Kartik Aaryan: బాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది. నటుడు కార్తిక్ ఆర్యన్, దర్శకుడు లవ్ రంజన్(Luv Ranjan) ఐదోసారి కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. వీరిద్దరూ గతంలో కలిసి చేసిన నాలుగు సినిమాలూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నవే.

‘ప్యార్ కా పంచనామ’, ‘ప్యార్ కా పంచనామ 2’, ‘సోను కే టిటూ కీ స్వీటీ’ లాంటి సినిమాలు కార్తిక్–లవ్ కాంబోకు బ్లాక్ బస్టర్ విజయాలను తీసుకొచ్చాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన ‘సోను కే టిటూ కీ స్వీటీ’ హ్యూజ్ బాక్సాఫీస్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పని చేయలేదు. దీంతో వీరి మధ్య విభేదాలున్నాయా అనే గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని తాజాగా బయటపడింది.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

ఒక ఇంటర్వ్యూలో, "వారి కాంబో మళ్లీ రిపీట్ కావడానికి కారణం సరైన కథ కోసం ఎదురు చూడటం. ప్యార్ కా పంచనామకు మించిన కథ దొరికిన తర్వాతే కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అలాంటి ఓ మంచి కథ దొరికింది." అని సన్నిహితులు చెప్పారు. 

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇద్దరూ చాలా ఇష్టపడ్డారని, ఇది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే, ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, అలియా భట్ జోడిగా నటించే అవకాశం ఉందని సమాచారం.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి బజ్ ఏర్పడింది. షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభమవుతుందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Advertisment
తాజా కథనాలు