Ticket Rates: సినిమా టికెట్ రేట్ల రగడ.. రూ. 200 పరిమితిపై హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే టికెట్ రేట్లను రూ. 200 కు పరిమితి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేడు దీనిపై విచారణ జరిపిన కోర్టు టికెట్ రేట్ల పరిమితిపై స్టే విధించింది.

New Update
karnataka high court onticket rates

karnataka high court onticket rates

Ticket Rates: కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే టికెట్ రేట్లను రూ. 200 కు పరిమితి చేస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్‌లతో  అన్ని థియేటర్లలో టికెట్ ధరలను గరిష్టంగా రూ. 200గా నిర్ణయించింది. సామాన్య ప్రజలకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. 

హైకోర్టులో పిటీషన్ 

అయితే ఈ నిర్ణయంపై థియేటర్ల యజమానులు,  సినీ నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్ల కంటే మల్టీ ప్లెక్స్ ల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని.. దానివల్ల తమకు అన్యాయం జరుగుతుందని  మల్టీ ప్లెక్స్ ఓనర్లు వాదించారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ  మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలు కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

హైకోర్టు స్టే

నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం టికెట్ ధరల పరిమితిపై స్టే విధించింది. దీనిపై విచారణ జరిపి తుది తీర్పు వచ్చే వరకు రూ. 200 టికెట్ ధరల పరిమితిని అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి  రవి వి. హోస్మాని తదుపరి తీర్పు వరకు థియేటర్లు యధావిధిగా టిక్కెట్ ధరలు వసూలు చేయవచ్చని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సినీ నిర్మాతలు,  PVR, INOX వంటి మల్టీప్లెక్స్ ఓనర్లకు కాస్త ఊరట లభించింది. 

ఇదిలా ఉంటే పిటీషనర్లు తమ వాదనలో అన్ని థియేటర్లకు ఒకే ధరను నిర్ణయించడం అనవసరమని పేర్కొన్నారు. థియేటర్లోని సౌకర్యాలు, థియేటర్ టైప్, కస్టమర్ ఎంపికపై టికెట్ ధరలు ఆధారపడి ఉండాలని వాదించారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలకు, సినీ పరిశ్రమకు సహాయపడేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాదించింది.  

ఇది కూడా చూడండి: Katrina- Vicky: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా - విక్కీ! బేబీ బంప్ ఫొటో రివీల్

Advertisment
తాజా కథనాలు