Kantara Chapter 1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసిందోచ్..

పాన్ ఇండియా మూవీ కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదల కానుంది. ట్రైలర్‌ను సెప్టెంబర్ 22, మధ్యాహ్నం 12:45కి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అమెరికాలో తెలుగు, కన్నడ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

New Update
Kantara Chapter 1 Trailer

Kantara Chapter 1 Trailer

Kantara Chapter 1 Trailer:

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా "కాంతారా: చాప్టర్ 1". అక్టోబర్ 2, 2025న ఈ చిత్రం భారీ స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. మొదటి భాగం కన్నడలో ఘనవిజయం సాధించగా, ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం, అతని నటన, టెక్నికల్ వ్యాల్యూస్‌తో అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్‌గా రాబోతున్న చాప్టర్ 1 పై కూడా భారీ క్రేజ్ నెలకొంది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇప్పుడు మేకర్స్ అభిమానులు ఎదురు చూస్తున్న ట్రైలర్ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ట్రైలర్‌ను సెప్టెంబర్ 22, మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు, అమెరికాలో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్కడ రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతోంది.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

తెలుగు వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కన్నడ వెర్షన్‌తో సమానంగా తెలుగు బుకింగ్స్ దూసుకెళ్తుండటంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి  ఏ  రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది. 

ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హొంబలే ఫిలిమ్స్ నిర్మాణం వహిస్తుండగా, సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందిస్తున్నారు. ఈ సారి కూడా "కాంతారా" మ్యాజిక్ మరోసారి కనపడనుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు