Yash Toxic Update: చివరి షెడ్యూల్ కి చేరుకున్న యశ్ 'టాక్సిక్'.. వివరాలు ఇలా..!

‘టాక్సిక్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ నుండి బెంగళూరులో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. నవంబర్ చివరి వరకు షూటింగ్ పూర్తిచేసి, మార్చి 19న విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

New Update
Yash Toxic Update

Yash Toxic Update

Yash Toxic Update: యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ఇప్పుడు షూటింగ్ చివరి దశలోకి వచ్చింది. ముంబైలో జరిగిన సుమారు 45 రోజుల భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తర్వాత, చిత్ర బృందం ప్రస్తుతం బెంగళూరులో కీలక సీన్ల షూట్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని హై‑ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ సన్నివేశాలు ఉన్నాయి.

ముంబై షెడ్యూల్‌లో, అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్ జే జే పెర్రీ కంపోజ్ చేసిన భారీ యాక్షన్ సీన్స్ చిత్రించారు. ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యశ్ ఇందులో కొత్తపాత్రలో కనిపించబోతున్నాడు, 

కియారా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, నయనతారా, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

బెంగళూరు షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం ప్రారంభమవుతుందని, నవంబర్ చివరి వరకు షూటింగ్ మోగించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత, పోస్టు‑ప్రొడక్షన్ కార్యక్రమాలను సమయానికి పూర్తి చేసి, డేటు చూసి రిలీజ్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు.

‘టాక్సిక్’ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని చెప్పుకుంటున్నా, ఇది సాదారణ కథాలా ఉండదని స్పష్టం అవుతోంది. భారీ యాక్షన్, భావోద్వేగాలు, పాత్రల మధ్య ఘర్షణలు ఇలా అన్ని కలిపి ఉండనున్నాయి. ప్రేక్షకులను కట్టి పడేసే కథా బలం కూడా 'టాక్సిక్' సినిమాలో ఉంటుందని మేకర్స్  అంటున్నారు.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

మార్చి 19న థియేటర్లలో..

ఈ చిత్రానికి సంభందించి మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో వస్తాయి. రానున్న కొన్ని వారాల్లో పాటలు, ట్రైలర్ వంటి విషయాలపై ప్రకటన ఉండొచ్చు. ఇక విడుదల తేదీ కూడా వచ్చే సంవత్సరంలో మార్చి 19న థియేటర్లలో ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇది యశ్ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ మూవీగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా షెడ్యూల్‌ పూర్తి చేస్తున్నారు. యశ్ న్యూ అవతారులో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముంబైలో మొదటి షెడ్యూల్‌ సక్సెస్‌తో మూవీ టీమ్ హ్యాపీగా ఉంది.

Advertisment
తాజా కథనాలు