BIG BREAKING: షాకింగ్ న్యూస్.. యువ నటుడు కన్నుమూత

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సంతోష్ బాలరాజ్ తన 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంత కాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

భారతీయ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు సినీ దిగ్గజాలు, సాంకేతిక నిపుణులు అకాల మరణం చెందడం సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవలే కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ వంటి నటులు ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

కన్నడ యువ నటుడు సంతోష్ బాలరాజ్ తన 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ (ఆగస్టు 5, 2025) ఉదయం 9:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

మొదట నటుడు సంతోష్ బాలరాజ్ కామెర్ల సమస్యతో హాస్పిటల్‌లో చేరాడు. అక్కడ ట్రీట్మెంట్ అనంతరం ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. అయితే కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తిరిగి హాస్పిటల్‌లో చేరాడు. అలా ఈ వారం మొదట్లో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అందలో అతడి ఆరోగ్యం క్లిష్టంగా మారి కోమాలోకి వెళ్లినట్లు వెల్లడించాయి. దీంతో చివరికి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. 

సంతోష్ బాలరాజ్ ప్రముఖ కన్నడ సినీ నిర్మాత అనేకల్ బాలరాజ్ కుమారుడు. అనేకల్ బాలరాజ్ ‘కరియా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు సంతోష్ తండ్రి 2022లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణం తర్వాత సంతోష్ తన తల్లితో నివాసముంటున్నారు. ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించాలని ఎన్నో కలలు కన్నారు. 

సినీ కెరీర్, బెస్ట్ మూవీస్:

2009లో సంతోష్ బాలరాజ్ తన సినీ జీవితాన్ని ‘కెంప’ సినిమాతో మొదలెట్టారు. కానీ ఆయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘గణప’. 2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి స్పందన అందుకుంది. ఇందులో సంతోష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘కరియా 2’ (2017) లో కూడా సంతోష్ బాలరాజ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వీటితో పాటు, 'ఒలవిన ఒలే' (2012), 'జన్మ' (2013) వంటి చిత్రాల్లో కూడా ఆయన తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఆయన చివరిసారిగా 2024లో విడుదలైన ‘సత్యం’ అనే సినిమాలో కనిపించారు. త్వరలో 'బెర్క్‌లీ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

సంతోష్ బాలరాజ్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు ఒక తీరని లోటు. ఆయన నటించిన కొన్ని సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోయినా, తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. యువ వయసులోనే ఆయన మృతి చెందడం సినీ వర్గాలను కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Advertisment
తాజా కథనాలు