/rtv/media/media_files/2025/10/22/jr-ntr-2025-10-22-19-33-41.jpg)
JR NTR
JR NTR: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నందిపాటి మురళి ఆధ్వర్యంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం, ఈరోజు (బుధవారం) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారికి అధికారికంగా ఫిర్యాదు సమర్పించింది.
కొంతమంది ఆకతాయిలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన రీతిలో పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టులు ఎన్టీఆర్ వ్యక్తిగత గౌరవానికి, ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉన్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
అటువంటి అభ్యంతరకరమైన పోస్టులను తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వాటిని పోస్ట్ చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న ఇటువంటి దుష్ప్రచారాలపై పోలీసులు వెంటనే స్పందించి, ఎన్టీఆర్ అభిమానులకు న్యాయం చేయాలని ఈ సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడుతున్నారు. ఇప్పటికే నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఉపయోగించి తన అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సదరు సెలబ్రెటీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా రక్షణ కల్పించింది.
Also Read: Ilaiyaraaja: కుర్ర హీరోకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్! సినిమాపై కోర్టులో కేసు