/rtv/media/media_files/2025/10/22/ilaiyaraaja-2025-10-22-16-06-51.jpg)
ilaiyaraaja
Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటల విషయంలో మరోసారి కోర్టు మెట్లెక్కారు. కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రీ మేకర్స్ నిర్మించిన 'డ్యూడ్' సినిమాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. 'డ్యూడ్' టీమ్ తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన రెండు పాటలను సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. 'పుదు నెల్లు పుదు నత్తు' సినిమాలోని 'కరుత మచ్చాన్' పాటను అనుమతి లేకుండా ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూవీ టీమ్, అలాగే ఆడియో రైట్స్ కొనుగోలు చేసిన సోనీ మ్యూజిక్ కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
#Ilaiyaraaja strongly opposes the use of his copyrighted songs in the Tamil film #Dude and is reportedly planning to take legal action against Sony Music India, Echo Recording and Orient Records for unauthorized usage. pic.twitter.com/20UJTq5jFV
— Digi Star (@TheDigiStar) October 22, 2025
మోసం చేస్తున్నారు..
ఈరోజు న్యాయస్థానం దీనిపై విచారణ జరపగా ఇళయరాజా తన న్యాయవాది ద్వారా మాట్లాడుతూ.. ''నేను ప్రసిద్ధ సంగీత దర్శకుడిని కావచ్చు.. కానీ కొన్ని మ్యూజిక్ కంపెనీలు నన్ను మోసం చేస్తున్నాయి. ఎటువంటి అనుమతి లేకుండా నా పాటలను వాడుకుంటున్నారు. నా పాటలను మార్చి, బీట్స్ జోడించి వాడుతున్నారు'' అని తెలిపారు. దీంతో న్యాయస్థానం అనుమతి లేకుండా ఇళయరాజా పాటలను ఇతర సినిమాల్లో వాడితే.. ఆయనకు ప్రత్యేకంగా మరో దరఖాస్తు దాఖలు చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపింది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలోనూ
తన పాటల విషయంలో ఇళయరాజా కోర్టును ఆశ్రయించడం ఇదేం మొదటిసారి కాదు. రీసెంట్ గా అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో కూడా అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు వేశారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఇళయరాజా హిట్ సాంగ్స్ 'ఒత్త రూబా తరేన్', 'ఎన్ జోడి మంజ కురువి', 'ఇళమై ఇదో ఇదో' లను ఉపయోగించారని ఆరోపించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మైత్రీ మేకర్స్ సినిమాలో నుంచి ఆ పాటలను తొలగించింది.
Also Read: Kantara Chapter 1: రిషబ్ శెట్టి 'కాంతారా చాప్టర్ 1' రేర్ ఫీట్.. మొదటి ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్!