JIGRIS Teaser: యంగ్ టాలెంట్ కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్' టీజర్ విడుదలైంది. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. "కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్ వద్దేవద్దు అని షో చేస్తారు. కానీ, కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు'' అంటూ యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. నలుగురు స్నేహితులు, వారి చుట్టూ సాగే సన్నివేశాలతో టీజర్ నవ్వులు పూయించింది. కొన్ని కొన్ని చోట్ల టీజర్ 'హుషారు', 'ఈ నగరానికి ఏమైంది' వైబ్స్ ఇస్తోంది.
జిగ్రీస్ టీజర్ ..
నలుగురు స్నేహితులు కలిసి ఒక పాత మారుతీ 800 కారులో గోవా ట్రిప్‌కు వెళ్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళ మధ్య జరిగే సరదా గొడవలు, కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతుంది. ఇది ఒక క్రేజీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో కొన్ని డైలాగులు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ సినిమా తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించాడని తెలిపారు. ఈ రోజుల్లో అశ్లీలత లేకుండా కామెడీ చేయడం చాలా అరుదని, కానీ దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల దానిని అద్భుతంగా చేశారని ప్రశంసించారు. అలాగే, సంగీతం చాలా బాగుందని, త్వరలో సినిమాలోని పాటలు కూడా విడుదల అవుతాయని తెలిపారు.
Intresting First Look & Poster 💥
— Sandeep Reddy Vanga (@imvangasandeep) June 28, 2025
First film is always very special 🤝#Jigrisfirstlook#JIGRIS@ramnitin8@anjalidream@anjaliidream@thedheerajkv@muralidhar.manigouri
@aslisaleempheku
@krishna_jigris
@krishna_burugula_@harishreddy08@krishnawglpic.twitter.com/RxzcoGi8kF
డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మించారు. కామ్రాన్ సయ్యద్ సంగీతం అందించారు. ఈశ్వర ఆదిత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. చైతన్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. టీజర్ చూసిన తర్వాత జిగ్రీస్ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. యూత్ ఆకట్టుకునే ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ రామ్ నితిన్ 'మ్యాడ్' ఫ్రాంచైజీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన రామ్.. తన నటనతో మెప్పించి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. రామ్ నితిన్ హలో వరల్డ్, ఫిఫ్త్ వేదా, మిస్టర్ నాగభూషణం వంటి వెబ్ సీరీస్ లలో నటించాడు. 'మ్యాడ్ ' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.
Also Read:War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!