కొరియోగ్రఫర్ జానీ మాస్టర్.. డ్యాన్సర్‌పై లైంగిక ఆరోపణల మీద ఆయన భార్య అయేషా RTV తో మాట్లాడారు. ఈ మేరకు ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. తన భర్త అరెస్ట్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని, ఆ అమ్మాయి ఎలాగైనా టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఇలా చేసిందని, ఈ విషయంలో ఆమెకు తన పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉందని చెప్పారు.
ఆమె ఒక సైకో...
ఇది పూర్తిగా తప్పుడు కేసు, కానీ దీన్నిపకడ్బందీగా చేస్తున్నారు. ఆ అమ్మాయి ఓక సైకో. ఈ రోజు ఆమెకి సపోర్ట్ చేసిన వాళ్లపైనే మళ్ళీ కేసు పెడుతుంది. ఆమెకు డ్యాన్స్ మాస్టర్ కార్డు రాకపోతే జానీ.. యూనియన్ తో ఫైట్ చేసి మరీ ఇప్పించారు. తనే మాస్టర్ ను ఇష్టపడింది. ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని కోరిక. తన కెరీర్ కోసం జానీ మాస్టర్ ను వాడుకుంది.
Also Read : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్టులుగా స్టార్ డైరెక్టర్స్
చాలాసార్లు ఆమెతో పాటూ వాళ్ళ మదర్ కూడా మా ఇంటికి వచ్చింది. వాళ్ళ మదర్ మాట్లాడిన ఆడియోలు కూడా ఉన్నాయి. అవి ఎవరికి ఇవ్వాలో వాళ్లకే ఇస్తా బయట ఇంత జరుగుతున్నా.. ఆ అమ్మాయి తల్లి ఎందుకు మాట్లాడటం లేదు' అంటూ చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఫుల్ ఇంటర్వ్యూ చూడండి.