జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. . ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది.
సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబును గెస్ట్ గా పిలవనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు.
This is for his OCEAN OF FANS who’ve been eagerly waiting to see their Demigod…..❤️❤️❤️
— Devara (@DevaraMovie) September 19, 2024
He can’t wait to see you either. :) Let’s bring a FLOOD of love!
See you on the 22nd. #Devara#DevaraOnSep27th pic.twitter.com/7Q3YyRepy3
Also Read : 'బొమ్మరిల్లు' షూటింగ్.. ఆ చిన్న సీన్ కోసం 35 టేకులు తీసుకున్న జెనీలియా
ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇండియన్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్ తో పాటూ 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ ఇప్పుడు మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతానికి దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.
స్పెషల్ షోలకు పర్మిషన్...
తెలంగాణ ప్రభుత్వం ‘దేవర’ స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ‘దేవర’ మూవీ టీమ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్ షోలు, టికెట్‌ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తొలిరోజు అర్ధరాత్రి 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.