కంటతడి పెట్టిస్తున్న జానీ మాస్టర్ వీడియో.. వెక్కి వెక్కి ఏడుస్తూ జానీ మాస్టర్ 37 రోజుల జైలు జీవితం అనుభవించిన తరువాత తాజాగా బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్లడంతో ఇన్ని రోజులు తండ్రిని చూడకుండా ఉన్న పిల్లలు ఒక్కసారిగా జానీని హత్తుకున్నారు. ఆపై జానీ భార్య సైతం జానీని హత్తుకుని కంటతడి పెట్టుకుంది. By Seetha Ram 26 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లాడు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ జానీ పై కేసు పెట్టింది. అంతేకాకండా మతం మార్చుకోమని టార్చర్ పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన ఇంటికి వచ్చి కూడా అత్యాచారం చేశాడంటూ తెలిపింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఇక 37 రోజుల జైలు జీవితం అనుభవించిన తరువాత జానీ తాజాగా బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ అయితే జైలు నుంచి బయటకు వచ్చిన జానీ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు తాను మొదటి సారి కొరియోగ్రఫీ చేసిన హరే రామ్ హరరే రామ్ అనే హిందీ సాంగ్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుని థాంక్స్ చెప్పాడు. 37 రోజులు జైలులో నరకం ఈ మేరకు ఈ 37 రోజులు జైలులో తాను ఎంత నరకం అనుభవించాడో తెలుపుతూ వీడియో పంచుకున్నాడు. ఇంకా తనకు జైల్లో ఉన్నట్లు అనిపిస్తుందని అన్నాడు. అక్కడ ఫుడ్ తినలేకపోయానని.. మనిషి అనేవాడు జీవితంలో ఏ రోజు జైలుకు వెళ్లవద్దని తెలిపాడు. జైల్లో చాలా నరకం అనుభవించినట్లు తెలిపాడు. దీని కారణంగా రెండు రోజులు అయితే తప్ప తాను మామూలు స్థితికి రాలేనని చెప్పాడు. ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! కంటతడి పెట్టిస్తున్న ఎమోషనల్ వీడియో ఈ వీడియో తర్వాత ఇప్పుడు మరో ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. తాను జైలు నుంచి ఇంటికి వెళ్లగానే భార్య, పిల్లల్ని హత్తుకుని బోరున ఏడ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా డోర్ తీయగానే ఆయన కొడుకు, కూతురు పరుగెత్తుకొని వచ్చి జానీ మాస్టర్‌ను హగ్ చేసుకున్నారు. A lot is taken away from us in these 37 days 🥹 My family & well wishers' prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever 🙏🏻 pic.twitter.com/kJFgi4zad2 — Jani Master (@AlwaysJani) October 26, 2024 ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! ఆపై ఏడుస్తూ కంటనీరు పెట్టుకున్నాడు. ఈ 37 రోజులు తండ్రి లేకుండా జానీ కూతురు ఊహించుకోలేకపోయింది. తండ్రిని తలచుకుంటూ పేపర్ పై బొమ్మలు గీసింది. అందుకు సంబంధించిన పేపర్‌ను తండ్రి రాగానే వెంటనే చూపించింది. అలాగే జానీ తన భార్య సైతం హత్తుకుని కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఈ వీడియోను జానీ షేర్ చేస్తూ.. ఈ 37 రోజులలో తన నుంచి చాలా తీసేసుకున్నారన్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! తన కుటుంబం & శ్రేయోభిలాషుల ప్రార్థనలు తనను ఈరోజు ఇక్కడకు చేర్చాయని తెలిపారు. నిజం ఎన్నిరోజులు దాగదు. ఎప్పటికైనా బయటపడుతుంది. తాను బతికున్నంత వరకు ఈ బాధ తన హృదయాన్ని గుచ్చుతూనే ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #jani-master #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి