చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల అయ్యారు. పలు షరతులతో జానీ మాస్టర్‌కి నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ పనిచేసే ప్లేస్‌కు వెళ్లి.. ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు చెప్పింది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్!
కాగా గత నెల 15న జానీపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అవకాశాల పేరుతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. అతడితో పాటు జానీ మాస్టర్ భార్య పేరును కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ గత నెల రోజులుగా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు.
ఏం జరిగింది..
ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2017లో తనను అత్యాచారం చేశాడని.. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!
అంతేకాకుండా షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లు అని చెప్పిన ఆమె.. తాను మైనర్‌గా ఉన్నపుడే తనపై దాడి చేశాడని పేర్కొంది. దీంతో పోలీసులు జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు.
నేషనల్ అవార్డు రద్దు
ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!
కోలీవుడ్‌లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రాంబలం చిత్రానికి బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీకి నేషనల్ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డు అందుకోబోతున్న తరుణంలో జానీ మాస్టర్ జైల్లో ఉండటంతో బెయిల్‌కు అప్లై చేశారు. దాదాపు బెయిల్ మంజురు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు అవార్డు ఇవ్వకుండా జాతీయ అవార్డుల కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు.