Jani Master Controversy : కొరియోగ్రఫర్ జానీ మాస్టర్.. డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే జానీమాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దీనిపై ఫిలిం చాంబర్ లోని పలువురు రెస్పాండ్ అయ్యారు.
చీలిన ఇండస్ట్రీ...
వారిలో కొందరు జానీ మాస్టర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఆయన్ను తప్పు బడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిపోయింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది సర్వ సాధారణం. కానీ ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో తెలుసుకోకుండానే తోటి పరిశ్రమకు చెందిన వ్యక్తులే రకరకాలుగా మాట్లాడటం గమనార్హం.
Also Read : అరెస్ట్ వెనక కుట్ర.. చేసేదంతా వాళ్లే.. RTVతో జానీ మాస్టర్ భార్య
ఇక ఇండస్ట్రీలో అగ్ర కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్.. ఈ వివాదంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే ఆయన్ను జనసేన కార్యక్రమాలకు దూరంగా పెట్టారు. అటు డ్యాన్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు.
మరోవైపు నిన్న గోవాలో అరెస్టు చేసిన జానీ మాస్టర్ ను పోలీసులు.. నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులు కోర్టును 9 రోజుల కస్టడీని కోరారు. కాగా దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.