జానీ మాస్టర్ కేసులో ఊహించని మలుపు.. చేసిందంతా ఆ అమ్మాయే?

జానీ మాస్టర్ కేసు ఉహించని మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన అమ్మాయిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఆ అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్ అల్లుడు షమీర్ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
jaani

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఉహించని మలుపు తిరిగింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని అతని దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన యువతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ యువతిపై జానీ మాస్టర్ అల్లుడు కేసు పెట్టాడు. ఈ మేరకు నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు పిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చంచల్ గూడ జైలుకి తరలించారు. అయితే ఇటీవల జానీ మాస్టర్ డ్రైవర్ తో సదరు యువతి మాట్లాడిన కాల్ రికార్డింగ్ బయటికొచ్చింది. మాస్టర్ ని మర్చిపోలేక పాత వీడియోలన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఆయన నాతో మాట్లాడడం లేదు. నాకు చాలా బాధేస్తుంది.. అంటూ చెప్పింది. 

ఇక ఈమె మాటలు విన్న జానీ మాస్టర్ డ్రైవర్ మరి మీకు జానీ మాస్టర్ రింగ్స్, నెక్లెస్ రెండు ఇచ్చారు కదా అని అడిగితే.. ఆ రెండిటిని మాస్టర్నే నా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ వద్దు ఆయనే కావాలి అన్నట్లు మాట్లాడింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో మరో సంచలన నిజం బయటికొచ్చింది.

రివర్స్ కేసు..

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయిపై జానీ మాస్టర్ అల్లుడు షమీర్.. నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న మామ తో హైదరాబాద్, చెన్నై, ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు తనను లైంగికంగా వేదించిందని, తనతో ఆ పని చెయ్యాలంటూ బెదిరించి నగ్న ఫొటోలు తీసి తనను లైంగికంగా వేధించిందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుడు అతను మైనర్ అని పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలేదని, ఇప్పుడు పోలీసులు ఆమెను కఠినంగా శిక్షించాలని కోరినట్లు సమాచారం. 

నమ్మ శక్యంగా లేదే..

అయితే జానీ మాస్టర్ అల్లుడి ఫిర్యాదు నమ్మ శక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి అలా చేసుంటే.. ఇన్ని రోజులు కంప్లైట్ ఇవ్వకుండా ఏం చేశాడు? జానీ మాస్టర్ జైలుకు పోకముందే ఈ పని చేయొచ్చు కదా! ఇదేదో జానీ మాస్టర్ కేసును పక్కదోవ పట్టించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా ప్లాన్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు విచారణ జరిపి ఎలాంటి నిజాలు వెలికితీస్తారో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు