Param Sundari Trailer: జాన్వీ 'పరం సుందరి' ట్రైలర్ వచ్చేసింది.. అందమే ఆమెకు శాపమా?

జాన్వీ కపూర్ -సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పరం సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.

New Update

Param Sundari Trailer: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అటు నార్త్ లో, ఇటు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో ఈ ముద్దుగుమ్మ నటించిన లేటెస్ట్ మూవీ 'పరం సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ అన్నీ కలగలిపి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ  'సుందరి' అనే ఓ మధ్య తరగతి అమ్మాయిగా కనిపించబోతుంది. అందంగా ఉండడం ఒక వరంలా భావించే ఆమెకు.. అదే అందం జీవితంలో అనేక సమస్యలకు ఎలా కారణమైంది అనే అంశం ఆసక్తికరంగా అనిపించింది. 

'పరం సుందరి' ట్రైలర్ 

ట్రైలర్ లో జాన్వీ కాస్ట్యూమ్స్, లొకేషన్స్, విజువల్స్, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి.  సుందరి పాత్రలో జాన్వీ నటన, అమాయకత్వం, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. జాన్వీ గత సినిమాలకంటే ఈ సినిమాలోని ఆమె పాత్ర, కథాంశం బిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో హీరోగా, సుందరి  ప్రేమికుడిగా సిద్దార్థ్ మల్హోత్రా నటించాడు. మొత్తానికి 'పరం సుందరి'ట్రైలర్.. జాన్వీ అందం, దానివల్ల ఆమెకు ఎదురయ్యే సంఘటనలు, ప్రేమ సెటిమెంట్ తో అలరించింది.

ట్రైలర్ చివరిలో జాన్వీ.. తమిళ్ కి రజినీ, కన్నడ కి యష్, ఆంధ్రలో అల్లు అర్జున్ అంటూ చెప్పిన ఓ డైలాగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.  జాన్వీ, సిద్దార్థ్ తో పాటు ఇతర నటీనటులు కూడా తమ నటనతో అలరించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సాధించింది. 

తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెంజీ పనికర్, సిద్ధార్థ శంకర్, మంజోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఇప్పటికే  ట్రైలర్ చూసిన ప్రేక్షకులంతా  ఇది ఒక విభిన్నమైన కథ అని, కొత్తదనం కోరుకునేవారికి తప్పకుండా నచ్చుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి 'పరం సుందరి' సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: 43rd India Day Parade New York: విజయ్, రష్మికకు అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్‌లో సందడి!

Advertisment
తాజా కథనాలు