రాకింగ్ రాకేష్ పార్టీలో రోజా, అనసూయ, జబర్దస్త్ టీమ్.. ఎందుకో తెలుసా?

జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కేశవ చంద్ర రామావత్'. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జబర్దస్త్ టీమ్, జడ్జ్ రోజా,అనసూయ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాకేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

New Update

Rakesh Keshava Chandra Ramavath:  జబర్దస్త్ పాపులర్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ 'కేశవ చంద్ర రామావత్'. బంజారా యువకుడి జీవిత కథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అంజి దర్శకత్వం వహించారు. ఇందులో ఫీమేల్ లీడ్ గా యంగ్ బ్యూటీ అనన్యకృష్ణన్ నటించింది. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు రాకింగ్ రాకేష్. ఇందులో భాగంగా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. రోజా, జానీ మాస్టర్, శివబాలాజీ, సుడిగాలి సుదీర్, పలువురు జబర్దస్త్ కమెడియన్స్ ఈవెంట్ కు హాజరయ్యారు. రాకేష్ కు సపోర్ట్ గా సినిమాను ప్రమోట్ చేశారు. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

పార్టీలో రోజా, అనసూయ, జబర్దస్త్ టీమ్.. 

ఇది ఇలా ఉంటే.. తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాకేష్ తన జబర్దస్త్ టీమ్ కోసం చిన్న పార్టీ నిర్వహించగా.. ఇందులో రోజా, యాంకర్ అనసూయ, చంటి, ఇమ్మాన్యుయేల్, భాస్కర్ పలువురు కమెడియన్స్ పాల్గొన్నారు. సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాకేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  రాకింగ్ రాకేష్ జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత తన కామెడీ స్కిట్లతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా, నిర్మాతగా  తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. 

Also Read: కడప దర్గా వివాదంలో రామ్ చరణ్.. మాల తీసి క్షమాపణ చెప్పాలి!

Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!

Advertisment
తాజా కథనాలు