/rtv/media/media_files/2025/09/23/ravi-teja-2025-09-23-18-52-19.jpg)
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నిన్నే పెళ్ళాడతా. 1996లో వచ్చిన ఈ కుటుంబ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది.
రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన దర్శకుడు కృష్ణవంశీ గూలాబీ సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా నాగార్జునకు బాగా నచ్చడంతో కృష్ణవంశీకి ఆఫర్ ఇచ్చారు. దీంతో కృష్ణవంశీ వెంటనే ఓ కథ చెప్పగా నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గులాబీ సినిమా విడుదలైన తర్వాత అది తన గురువు రాంగోపాల్ వర్మ స్టైల్లో ఉందనే కామెంట్స్ విపించడంతో నాగ్ తో ఆ కథను అపేసి నిన్నే పెళ్ళాడతా స్టోరీ చెప్పారు కృష్ణవంశీ . కేవలం పది రోజుల్లో స్క్రిప్టు పని పూర్తయింది. నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ పతాకంపై స్వయంగా నిర్మించారు.
నాగార్జున కెరీర్లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా
అక్టోబరు 4, 1996 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లో 12 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. నాగార్జున కెరీర్లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే కావడం విశేషం. ఇక కృష్ణవంశీని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలబెట్టిన సినిమా కూడా ఇదే. నాగార్జున, టబు జంట ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరి కెమిస్ట్రీ చాలా సహజంగా, ఆకర్షణీయంగా కనిపించింది. టబు ఈ సినిమా తర్వాత తెలుగులో చాలా పెద్ద స్టార్‌గా ఎదిగారు.
ఈ సినిమాలోని కథ చాలా సింపుల్ అయినప్పటికీ, కృష్ణవంశీ తన ప్రత్యేక శైలిలో దీన్ని తెరకెక్కించారు. సినిమా అంతా ఒక ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది, ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ కథ అందర్నీ ఆకట్టుకుటుంది. ఈ సినిమాలో హీరోయిన్ టబుపై ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సాంగ్ ను చిత్రకరించగా...అందులో టబు జట్టు గాలికి వెలాడుతూ ఉంటుంది. అలా ఎగరడానికి తానే ఫ్యాన్ పట్టుకున్నానని హీరో రవితేజ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా చిన్న సీన్లలో కూడా నటించారు. ఈ సినిమా తరువాత రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే.