/rtv/media/media_files/2025/08/13/amitabh-bachchan-kbc-2025-08-13-15-38-08.jpg)
Amitabh Bachchan KBC
KBC Show: అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC) షో వివాదంలో చిక్కుకుంది. ఆపరేషన్ సింధూర్' లో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి షోలో పాల్గొనడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇండిపెండ్స్ డే సందర్భంగా చేస్తున్న స్పెషల్ ఎపిసోడ్ లో వీరు ముఖ్య అతిథులుగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు మేకర్స్. ఆగస్టు 15న ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
వివాదమేంటి..!
అయితే 'ఆపరేషన్ సింధూర్' లాంటి కీలకమైన ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు.. ఒక రియాలిటీ షోలో ప్రమోషన్ కోసం ఉపయోగించడం సరికాదని, ఇది సైన్యం గౌరవాన్ని తగ్గిస్తుందని విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు. "ఏ ఇతర దేశంలోనైనా ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ తర్వాత అధికారులు టీవీ షోలలో పాల్గొనడం చూశామా?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ఈ చర్యను ప్రభుత్వ్ పీఆర్ స్టెంట్ గా చెబుతున్నారు. రానున్న ఎన్నికల కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్నియూజ్ చేసుకుంటున్నారు అంటూ ఎక్స్ పోస్టుల ద్వారా ఆరోపిస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్లు ..సైనికాధికారులు దేశం కోసం చేసిన సేవలను, వారి ధైర్య సాహసాలను గుర్తించడం సరైనదే అని అంటున్నారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సైనికాధికారులు KBC షోలో పాల్గొనడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Have you ever seen anything like this after a military operation in any serious country?
— Mohit Chauhan (@mohitlaws) August 12, 2025
How is this even allowed for someone in service?
The current regime is shamelessly using our forces for its petty politics and hyper nationalism. pic.twitter.com/ejNKPP9BRQ
ఆపరేషన్ సింధూర్ ఏమిటి?
2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్రదాడిలో అనేక మంది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ లోని అందాలను చూసేందుకు పర్యాటకులుగా వెళ్లిన వీరు ఉగ్రదాడికి బలయ్యారు. 26 మందికి పైగా భారత పౌరులు మరణించారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సింధూర్' మిషన్ చేపట్టింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా భారత సైన్యం, వైమానిక దళం కలిసి కాశ్మీర్ లోని పాకిస్థాన్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలపే దాడులు చేశారు. తొమ్మిదికి పైగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.
ఈ ఆపరేషన్ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణ డియోస్థలి వంటి మహిళా సైనికాధికారులు కీలక పాత్ర పోషించారు. 'ఆపరేషన్ సింధూర్' కి సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్స్, ఇతర ప్రణాళికలు వీరి ఆధ్వర్యంలో జరిగాయి.
Three decorated officers appearing on a privately owned TV show in full uniform says a lot. Not about the show, but about how we’ve reduced the forces to props for optics. Shamelessness at its peak.#OperationSindoorpic.twitter.com/AoVDwlYpgR
— Pracool (@thehighmonk) August 13, 2025
Also Read: Anupama Parameswaran: సిద్ధుతో అలా చేయడం నచ్చలేదు.. అనుపమ సంచలన కామెంట్స్!