/rtv/media/media_files/2025/11/15/ibomma-2025-11-15-09-45-16.jpg)
తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేశారు. దీంతో అతడితోనే వెబ్‌సైట్లను మూసివేయించారు. వెబ్ సైట్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఈమేరకు చర్యలు చేపట్టారు.
కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహణకు పాల్పడుతున్నాడు. ఐబొమ్మ వెబ్ సైట్ మొత్తం పైరసీ, ఓటీటీలు ఉంటాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో దమ్ముంటే పట్టుకోవాలంటూ ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి ఏకంగా సవాల్ కూడా చేశాడు.
దీంతో ఇమ్మడి రవి విసిరిన సవాల్‌ను స్వీకరించిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను మూసివేయించడం అసలు ట్విస్ట్ .. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను పోలీసులు చెక్ చేస్తున్నారు. రవి కస్టడీ కోరుతూ సోమవారం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Follow Us