/rtv/media/media_files/2025/11/20/ibomma-2025-11-20-08-13-13.jpg)
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమండి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఐ-బొమ్మ ఉండదు.. అందులో సినిమాలు రావు..వెబ్ సైట్ కూడా క్లోజ్ చేశారు. దీంతో పోలీసులు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ పోలీసులకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఆన్ లైన్‌లో కొత్తగా iBOMMA 1 అనే ఓ వెబ్ సైట్ వచ్చింది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే మూవీ రూల్జ్ కు అది రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్ సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ 1 ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ /MV సైట్లపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఐ-బొమ్మ మళ్లీ రావడంతో సినిమా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Follow Us