/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ప్రఖ్యాత పొందిన నటుడు, దర్శకుడు రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ 89 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన తన సుదీర్ఘ సినీ జీవితంలో అనేక చిరస్మరణీయమైన, అత్యుత్తమ చిత్రాలను అందించారు. అంతేకాకుండా హాలీవుడ్‌లో గోల్డెన్ బాయ్‌గా ప్రసిద్ధి చెందారు. రెడ్‌ఫోర్డ్ దర్శకత్వ ప్రపంచంలో కూడా అద్భుతాలు చేశారు. ఈ నటుడు రెండుసార్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఆయన మృతితో ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.
robert redford died
రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ 1960లలో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సినిమాలు చేశారు. ముఖ్యంగా ‘బుచ్ కాసిడీ అండ్ ది సన్‌డాన్స్ కిడ్’, ‘ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్’, ‘ది స్టింగ్’ వంటి సినిమాలతో బాగా ప్రజాదరణ పొందారు. విలక్షణమైన నటన, జుట్టు, ఇన్నోసెంట్ చిరునవ్వుతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కేవలం 10 ఏళ్లలో అంటే 1970 నాటికి హాలీవుడ్‌లోని ప్రముఖ స్టార్ యాక్టర్లలో ఒకరిగా చేరిపోయారు.
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించారు. తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతాలు చేశారు. దాదాపు రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అందులో ఒకటి.. రెడ్‌ఫోర్డ్ మెరిల్ స్ట్రీప్‌తో కలిసి ప్రధాన పాత్ర పోషించిన ‘‘అవుట్ ఆఫ్ ఆఫ్రికా’’ సినిమాకు ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర చిరస్మరణీయమైనదిగా మారిపోయింది. ఇది అతని కీర్తిని మరింతగా పెంచింది.
అలాగే ఆయన తీసిన ‘ఆర్డినరీ పీపుల్’ సినిమా 1980లో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దీంతో రెండు ఆస్కార్ అవార్డులను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా ఆయన ‘ఎ రివర్ రన్స్ త్రూ ఇట్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే రెడ్‌ఫోర్డ్ 2018లో తన నటనకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకముందు తాను 2016లో నటనతో విసిగిపోయానని చెప్పారు.
ఆ తర్వాత సన్డాన్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తరువాత ‘‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’’ గా మారింది. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్రోత్సవాలలో ఒకటిగా పేరుగాంచింది.