Anirudh Ravichander: అనిరుధ్ రవిచందర్ కి హైకోర్టు గుడ్ న్యూస్! ఫ్యాన్స్ కి పండగే

అనిరుధ్ రవిచందర్ కి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది.  నేడు చెన్నైలో జరగనున్న  తన కాన్సర్ట్ పై నిషేధం విధించాలంటూ  చెయ్యూర్‌  ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటీషన్ ని హైకోర్టు కొట్టివేసింది. తగిన జాగ్రత్తలతో కాన్సర్ట్ నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Anirudh Ravichander

Anirudh Ravichander

Anirudh Ravichander: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది.  నేడు చెన్నైలో జరగనున్న  తన కాన్సర్ట్ పై నిషేధం విధించాలంటూ  చెయ్యూర్‌  ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటీషన్ ని హైకోర్టు కొట్టివేసింది. తగిన జాగ్రత్తలతో కాన్సర్ట్ నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే అనిరుధ్  'హుక్కుమ్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా  మ్యూజిక్ కాన్సర్ట్స్  నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజికల్ టూర్ గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించగా.. మొదటి కాన్సర్ట్ దుబాయిలో నిర్వహించారు. ఇలా మొత్తం 10 దేశాల్లో 16  లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్  నిర్వహించబోతున్నారు. కాగా, ఇందులో భాగంగా ఈనెల 23న చెన్నై సమీపంలోని  కువత్తూర్‌లోని స్వర్మభూవి రిసార్ట్ లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. 

పిటీషన్ ఏంటి..? 

అయితే ఈ ఈవెంట్ ని నిర్వాహకులు కలెక్టర్ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, కాన్సర్ట్ కి వచ్చే ఆడియన్స్ కి కనీస వసతులు లేవని ఆరోపిస్తూ ఆ ప్రాంత ఎమ్మెల్యే పనైయూర్ బాబు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు   కాన్సర్ట్ ని నిషేదించాలని కోర్టును కోరారు. 

గ్రీన్ సిగ్నల్ 

కాగా.. ఈ పిటీషన్ పై తాజాగా విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు దీనిని కొట్టిపారేసింది. పలు జాగ్రత్తలతో కూడిన  సూచనలతో  అనిరుధ్ చెన్నై  కాన్సర్ట్ కి పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఆ ప్రాంత డీఎస్పీ అనుమతిని తప్పనిసరిగా పొందాలని ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. అనిరుద్ టాలీవుడ్, కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. కేరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే తన ఫ్రెష్ అండ్ డిఫరెంట్ మ్యూజిక్ సెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు.

ఇటీవలే రజినీకాంత్ 'కూలీ ' సినిమాలో అనిరుద్ పాటలు, బిజీఎం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ కూ.కూ..కూలీ సాంగ్ సినిమా విడుదలకు ముందే మిలియన్ల వ్యూస్ తో ఇంటర్నెట్ ని షేక్ చేసింది. తెలుగులో ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డం సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందించాడు. అలాగే తారక్ దేవర, గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి పలు చిత్రాలకు అనిరుద్ సంగీతం సమకూర్చారు. 

Also Read CINEMA: మళ్ళీ తెరపైకి హీరో గోవిందా విడాకుల కేసు.. అసలు కథ చెప్పిన లాయర్ !

Advertisment
తాజా కథనాలు