/rtv/media/media_files/2025/10/19/parineeti-chopra-2025-10-19-17-17-47.jpg)
Parineeti Chopra
Parineeti Chopra: స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. అక్టోబర్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. అయితే పరిణీతి చోప్రా పుట్టినరోజుకు కొద్దిగంటల ముందే ఈ శుభవార్త చెప్పడం విశేషం. అక్టోబర్ 20న పరిణీతి చోప్రా పుట్టినరోజు. ''చేతుల్లో మా బిడ్డ, మా హృదయాలు నిండా ఆనందం'' అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు.
2023లో పెళ్లి..
పరిణితీ చోప్రా- రాఘవ్ దంపతులు 2023లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు వీరి పెళ్లి వేడుకలో సందడి చేశారు. పెళ్ళైన రెండేళ్ల తర్వాత పరిణితీ- రాఘవ్ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
Also Read: CINEMA: ఆ కోరిక ఆపుకోలేకపోయా.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Follow Us