Hero Vishal: బాడీ అంతా 199 కుట్లు... హీరో విశాల్ చెప్పిన మాటలు వింటే షాకవుతారు!

స్టార్ హీరో విశాల్ ఇటీవలే 'మదగజరాజ' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన 35వ సినిమా 'మకుటం' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

New Update
hero vishal

hero vishal

Hero Vishal: స్టార్ హీరో విశాల్ ఇటీవలే 'మదగజరాజ' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన 35వ సినిమా 'మకుటం' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు 'యువర్స్ ఫ్రాంక్లీ విశాల్' అనే చిట్ చాట్ షోతో ప్రేక్షకులను అలరించనున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో విశాల్ తన సినీ కెరీర్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో బాడీ డబుల్స్ ఉపయోగించడం గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

శరీరంపై 119 కుట్లు 

విశాల్ మాట్లాడుతూ.. సినిమాలో ఎంతటి కస్టమైన స్టెంట్స్ అయినా సరే తానే స్వయంగా చేస్తానని తెలిపారు. డూప్స్ తో చేయించడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని అన్నారు. అలాంటి యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న సమయంలో చాలా సార్లు గాయపడ్డానని.. ఇప్పటివరకు శరీరానికి 119 కుట్లు పడ్డాయని తెలిపారు. దీంతో పాటు నటుడు అర్జున్ తో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. అలాగే తన హిట్ మూవీ 'పందెం కోడి' అవకాశం తనకెలా వచ్చిందో కూడా గుర్తుచేశారు.  

అలాగే విశాల్ అవార్డుల పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తనకు జాతీయ అవార్డులతో సహా ఏ అవార్డులు ఇష్టం ఉండవని తెలిపారు. అవార్డు అనేది కేవలం ఎనిమిది మంది మాత్రమే నిర్ణయించడం, తీర్పు ఇవ్వడం లాంటిది. అవార్డు ఎంపికకు వారు పబ్లిక్ సర్వ్ ఎందుకు తీసుకోకూడదు? నాకు అవార్డు వచ్చినా.. దానిని చెత్తబుట్టలో వేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: Bigg Boss 9: పచ్చళ్ళ పాప దుమ్ముదులిపిన నాగ్ మామ.. డెమోన్, రీతూ లవ్ స్టోరీ షాకింగ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు