ఆకట్టుకుంటున్న టీజర్..
ఇందులో రోషన్ మైఖేల్ సీ. విలియమ్స్ అనే యువ ఫుట్‌బాల్ ఆటగాడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఆర్మిలో పనిచేసే సోల్జర్ పాత్రను కూడా పోషించాడు. హీరో తన క్రీడా సామర్త్యాన్ని ఉపయోగించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఈ సినిమా ప్రధాన కథాంశం అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఫుట్ బాల్ ఆటలో రోషన్ వేగం, యాక్షన్ సన్నివేశాల్లో పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ , తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు హైలైట్ గా నిలిచాయి. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ను మరింత ఎనర్జిటిక్ గా మార్చింది.
THE GAME BEGINS ⚽️
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) November 1, 2025
Presenting #ChampionTeaser to you all ▶️ https://t.co/URQZHlPcCn#Champion in cinemas worldwide this 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟓𝐭𝐡. ⚡️#Roshan@PradeepAdvaitam#AnaswaraRajan@ActorSanthosh@MickeyJMeyer@madhie1@AshwiniDuttCh@SwapnaCinema@AnandiArtsOffl… pic.twitter.com/kBemOZ6S0K
'పెళ్లి సందడి' సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన రోషన్.. ఇందులో ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నాడు. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో అనస్వర తెలుగు తెరకు పరిచయమవుతోంది. టీజర్ లో రోషన్- అనస్వర కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చిన సన్నివేశాలు అలరించాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'సీతారామం', కల్కి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత వైజయంతి బ్యానర్ నుంచి వస్తున్న చిత్రమిది. దీంతో 'ఛాంపియన్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్ చూసిన తర్వాత.. సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది ప్రేక్షకుల్లో.
Also Read: Nara Rohit Wedding: నారా రోహిత్ పెళ్ళిలో చంద్రబాబు ఏం చేశారో చూడండి.. వైరలవుతున్న ఫొటోలు!
Follow Us