HERO DHANUSH: ముచ్చటగా మూడోసారి..  తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ధనుష్ గ్రీన్ సిగ్నల్!

తెలుగులో సార్, కుబేరా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న.. ధనుష్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ధనుష్ తెలుగులో మరో క్రేజీ కాంబోలో సెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Dhanush movie

Dhanush movie

HERO DHANUSH: హీరో ధనుష్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే  తెలుగులో సార్, కుబేరా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న.. ధనుష్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ధనుష్ తెలుగులో మరో క్రేజీ కాంబోలో సెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమై విరాట పర్వం మూవీతో విమర్శకుల ప్రశంసలు పొందిన వేణు ఊడుగులతో కలిసి ధనుష్ ఓ కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ధనుష్ గ్రీన్ సిగ్నల్

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డైరెక్టర్ వేణు ఇప్పటికే ధనుష్ కథ వినిపించగా.. ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే కథ ఒకే చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations)  ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా జానర్, కథాంశం, ఇతర నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటం రానుంది. తెలుగులో సార్, కుబేర చిత్రాలతో రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ధనుష్.. ఇప్పుడు వేణు సినిమాతో హైట్రిక్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతర భాష హీరోల్లో  ధనుష్ ఒకరు. ఆయనకు  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఇక్కడ కూడా ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరోవైపు బాహుబలి, RRR, కల్కి, పుష్ప వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ విజయాలు సాదిస్తుండడంతో అందరి దృష్టి టాలీవుడ్ వైపే ఉంది. దీంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ధనుష్ తమిళ్ లో ఇడ్లీ కడై సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిత్యమీనన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనికి ముందు ధనుష్ డైరెక్ట్ చేసిన రాయాన్ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇందులో ధనుష్ , టాలీవుడ్ హీరో సందీప్ లీడ్ రోల్స్ లో నటించారు. 

Also Read: SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్

Advertisment
తాజా కథనాలు