/rtv/media/media_files/2025/07/22/hansika-divorce-rumors-2025-07-22-09-40-38.jpg)
hansika divorce rumors
Hansika: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న చాలా మంది జంటలు పెళ్ళైన కొన్నాళ్లకే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా చేరింది. గత కొన్ని రోజులుగా హన్సిక తన భర్త కతురియా విడిపోయి, తల్లితో ఉంటున్నట్లు నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు మీడియా కథనాల్లో హన్సిక త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.
విడాకులు పై క్లారిటీ!
ఈ క్రమంలో హన్సిక భర్త సోహైల్ కతురియా ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించారు. తాము విడిపోతున్నాము అంటూ వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తమ బంధం బలంగా ఉందని, తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, తాము సంతోషంగా ఉన్నామనని క్లారిటీ ఇచ్చారు. దీంతో హన్సిక వైవాహిక జీవితం గురించి వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. హన్సిక మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కొంత కాలంగా హన్సిక తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అమ్మ, బ్రదర్ తో కలిసి ఉన్న ఫొటోలను మాత్రమే చేయడం ఈ పుకార్లకు దారితీసింది. సోహైల్, హన్సిక డిసెంబర్ 2022లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిపై 'లవ్ షాదీ డ్రామా' అనే రియాలిటీ షోగా కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన హన్సిక ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. హిందీ, తమిళ్లో అడపాదడపా సినిమాలు చేస్తోంది. దీంతో పాటు టీవీ షోలు, ఈవెంట్స్ లో ఎక్కువగా సందడి చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.