Honeymoon Muder: మేఘాలయ హనీమూన్ మర్డర్‌ స్టోరీతో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

సోనమ్ - రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్  కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించింది. పెళ్ళైన వారం రోజులకే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అతి కిరాతకంగా మర్డర్ చేయించింది!

New Update
honeymoon murder case

honeymoon murder case

Honeymoon Muder:  సోనమ్ - రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్  కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించింది. పెళ్ళైన వారం రోజులకే హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అతి కిరాతకంగా మర్డర్ చేయించింది! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను హత మార్చిన భార్య  సోనమ్ తీరు సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలను ఆపాలనే ఉద్దేశంతో ఈ ఘటనపై సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌పీ నింబావత్‌ దీనిని వెండితెరపై చూపించబోతున్నారు.  'హనీమూన్ ఇన్ షిల్లాంగ్'  అనే పేరుతో దీనిని తెరకెక్కితున్నారు. ఇప్పటికే సినిమాకు కావాల్సిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు దర్శకుడు నింబావత్‌ తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 80% చిత్రాన్ని ఇండోర్ లో, మిగతా 20%చిత్రాన్ని మేఘాలయాలో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. రాజా రఘువంశీ కుటుంబం కూడా దీనికి మద్దతు తెలిపారు. 

అందుకే సినిమా తీస్తున్నాం!

ఈ ఘటన ఆధారంగా సినిమా తీయడంపై  రఘువంశీ తమ్ముడు సచిన్  మాట్లాడుతూ.. ఈ హత్య కేసు సినిమా తీయడానికి తాము అంగీకరించినట్లు తెలిపారు. తన సోదరుడి మృతిని వెండి తెరపైకి తీసుకొస్తే ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే విషయాలు ప్రజల ముందుకు వస్తాయని నమ్ముతున్నాం అని తెలిపాడు. అలాగే దర్శకుడు నింబావత్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలను, నేరాలను ఆపాలనే ఉద్దేశంతో ఈ  సినిమా తెరకెక్కించేందుకు సిద్దమయ్యాం అని వెల్లడించారు. 

అసలు రాజా రఘువంశీ  కేసేంటి?

జీవితంపై ఎన్నో ఆశలు, కలలతో ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే 11న సోనమ్ అనే అమ్మాయిని కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లే తన పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయాడు. కట్టుకున్న భార్యనే ప్రాణానికి ముప్పని కనిపెట్టలేకపోయాడు. భార్య ఎంతో ప్రేమగా అడిగిందని 11న వివాహం జరగ్గా.. 20న  మేఘాలయకు హనీమూన్ తీసుకెళ్లాడు. అక్కడే భర్త మర్డర్ కి స్కెచ్ వేసింది సోనమ్! పెళ్ళికి ముందు నుంచే రాజ్‌ కుశ్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సోనమ్ తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలనుకుంది. దాని కోసమే హనీమూన్ ప్లాన్ వేసింది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చింది. సోహ్రా అనే ప్రాంతంలో ప్రియుడు మరో ముగ్గురు నిందితులు రాజా రఘువంశీని హత్య చేశారు. ఆ తర్వాత సోనమ్ ప్రియుడితో అటు నుంచి ఆటే వెళ్ళిపోయింది. 

అయితే  హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు సోనమ్- రఘువంశీ కోసం గాలించగా.. హత్య గురైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహం సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పడిపోయి కనిపించింది. అతడి తలపై గాయాలు, ఒంటిపై కత్తి పోట్లు ఉండడంతో హత్యగా అనుమానించారు పోలీసులు. ఆ తర్వాత భార్య సోనమ్ కోసం గాలించగా.. జూన్ 21 న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ ఘటన గురించి ఒక్కొక్క విషయం తెలుసుకున్న పోలీసులుకు భార్య సోనమే భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో రఘువంశీ హత్యకు కారణమైన భార్య సోనమ్, ప్రియుడు రాజ్ కుశ్వాహా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు