/rtv/media/media_files/2025/09/13/esther-2025-09-13-17-42-36.jpg)
నటి ఎస్తర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, క్యాప్షన్లు ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు దారితీశాయి. ఆమె క్రిస్టియన్ వివాహంలో ధరించే తెల్లని గౌనులో ఉన్న ఫోటోలను షేర్ చేసి, "త్వరలో ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తాను" అని పేర్కొనడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. ఎస్తర్ తన మొదటి భర్త, సింగర్ నోయెల్ సీన్‌తో విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ 2019లో వివాహం చేసుకుని, కొన్ని నెలలకే విడిపోయారు. విడాకుల తర్వాత ఆమె తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడారు. విడాకుల తర్వాత ఎస్తర్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె 'రెక్కి' వంటి కొన్ని వెబ్ సిరీస్‌లు మరియు సినిమాల్లో బోల్డ్ పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆమె 'అమరావతికి ఆహ్వానం' అనే చిత్రంలో నటిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకున్న ఎస్తర్, బెంగుళూరులో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సెలూన్‌ను కూడా ప్రారంభించారు.
1000 అబద్దాలు అనే సినిమాతో
ఎస్తర్ వాలెరీ నోరోన్హా 1992 సెప్టెంబర్ 12న బహ్రెయిన్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వలేరియన్ నోరోన్హా, జానెట్ నోరోన్హా. ఆమె తల్లి మంగళూరుకు చెందినవారు. ఎస్తర్ మంగళూరులోని సెయింట్ గెరోసా హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ, ముంబై యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1000 అబద్దాలు అనే తెలుగు సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా, ఆమె 'ది వేకెంట్ హౌస్' అనే సినిమాకు దర్శకత్వం వహించి, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించారు. ఈ సినిమాను ఆమె తల్లి జానెట్ నోరోన్హా నిర్మించారు. ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో త్వరగానే ఫేడవుట్ అయిపోయింది.సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండటంతో పాటు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది ఎస్తేర్.