OTT Movies: గత వారం తేజ సజ్జ 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ ' కిష్కిందపురి' సినిమాలు ఫుల్ ఎంటర్ టైం చేశాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
దక్ష'
చాలా గ్యాప్ తర్వాత నటి మంచు లక్ష్మి మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. మంచు లక్ష్మి, మోహన్ బాబు, సముద్రఖని, చిత్ర శుక్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'దక్ష'. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇందులో మంచు లక్ష్మీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
'బ్యూటీ':
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బ్యూటీ' సెప్టెంబర్ 19న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో తండ్రీకూతుళ్ల ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శివ సాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
'అందెల రవమిది'
'స్వర్ణకమలం' సినిమా స్పూర్తితో రూపొందిన చిత్రం 'అందెల రవమిది' సెప్టెంబర్ 19న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇందులో ఇంద్రాణి దావలూరి ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం, నాట్యం ఇతివృత్తంగా దీనిని తెరకెక్కించారు.
ఇంద్రాణి దావలూరి దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. 'స్వర్ణకమలం' సినిమా స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. సంగీతం, నాట్యం ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
'టన్నెల్'
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, అథర్వ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'టన్నెల్'ఈనెల 19న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన ట్రైలర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు.
భద్రకాళి..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా 'భద్రకాళి' కూడా సెప్టెంబర్ 19న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే 'మార్గన్' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న విజయ్.. ఇప్పుడు భద్రకాళి తో మరి హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తరిల్లర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి.
ఓటీటీ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్
- బిలియనీర్స్ బంకర్: సెప్టెంబరు 19
- హాంటెడ్ హాస్టల్ (వెబ్‌సిరీస్): సెప్టెంబరు 19
- ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్: సెప్టెంబరు 18
- ప్లాటోనిక్: సెప్టెంబరు 18
- 28 ఇయర్స్ లేటర్: సెప్టెంబరు 20
జీ 5
- హౌస్‌మేట్స్: సెప్టెంబరు 19
జియో హాట్‌స్టార్
- ది ట్రయల్ 2: సెప్టెంబరు 19
- పోలీస్ పోలీస్: సెప్టెంబరు 19
Also Read: Mahesh Babu: ప్లీజ్ ఫోన్ స్విచాఫ్ చేయకు బ్రదర్... వైరల్ అవుతున్న మహేష్ బాబు ట్వీట్!