తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటుంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.
అయితే సినిమాలో పెద్దగా ఛాన్స్ రానప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకుంటుంది.
తాజాగా ఎల్లో కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.