ENE Repeat: భారీ VFXతో ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్.. ట్విస్ట్ ఏంటంటే..?

ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ENE Repeat రూపొందుతోంది. 2026 రెండో భాగంలో విడుదల కానుంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో, సినిమా మేకింగ్ నేపథ్యంతో బడీ కామెడీగా తెరకెక్కుతోంది. పాత నటీనటులు మళ్లీ ఇందులో కూడా నటిస్తున్నారు.

New Update
ENE Repeat

ENE Repeat

ENE Repeat: టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బడీ కామెడీ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) కు సీక్వెల్ రాబోతున్న సంగతి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి అయిన సందర్భంగా, పార్ట్ 2ని ప్రకటించారు. ఈ సీక్వెల్‌కు ‘ENE Repeat’ అనే టైటిల్ పెట్టారు.

Ee Nagaraniki Emaindi

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా నిర్మాతల్లో ఒకరైన సృజన్ యారబోలు మాట్లాడారు. ఆయన చెప్పిన ప్రకారం, ENE Repeat సినిమా 2026 రెండో భాగంలో విడుదల కానుంది. ఇది కూడా బడీ కామెడీగానే ఉంటుందని, కానీ ఈసారి కథలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ ఉంటాయని తెలిపారు.

స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ, “150 పేజీల స్క్రిప్ట్ చదివిన తర్వాత సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. పూర్తిగా చదివిన తర్వాత, ఇది దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు రాసిన బెస్ట్ స్క్రిప్ట్ అని ఫీలయ్యాను” అన్నారు. ఈ సినిమా.. సినిమా మేకింగ్ చుట్టూ తిరిగే కథ అని, అయినా కూడా మొదటి భాగం లాగే బడీ కామెడీ ఫీల్ మిస్ అవ్వదని చెప్పారు.

ఇంకా మాట్లాడుతూ, “మొదటి భాగంలో ఉన్న నేచురాలిటీ అలాగే ఉంచాం. కానీ ఈసారి ఎమోషన్ మరింత బలంగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని ఎన్నో సర్ప్రైజ్‌లు సినిమాలో ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేను” అని తెలిపారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కకుమణు మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సహ నిర్మాణం చేస్తుండగా, సంగీతాన్ని వివేక్ సాగర్ అందిస్తున్నారు.

ENE Repeat పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగాన్ని ఇష్టపడ్డ ప్రేక్షకులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు