ఫేస్ బుక్ లో మెసేజ్, మూడు వారాల్లోనే పెళ్లి.. దుల్కర్ లవ్ స్టోరీ తెలిస్తే షాక్

‘అన్‌స్టాపబుల్‌' షోలో దుల్కర్ సల్మాన్ తన లవ్ స్టోరీని రివీల్ చేశారు.. స్కూల్ టైంలో తన భార్య తన జూనియర్ అని, మొదట్లో సరిగ్గా పరిచయం లేదని అన్నారు. చదువయ్యాక కలవాలని ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాను.ఆ తర్వాత మూడు వారాల్లోనే తమకు నిశ్చితార్థం జరిగిందని చెప్పారు.

dqf
New Update

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్నటాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4’. ఆహా ఓటీటీ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది.ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవ్వగా.. సెకెండ్ ఎపిసోడ్ లో ‘లక్కీ భాస్కర్‌’ టీమ్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ కార్యక్రమంలో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ పాల్గొన్నారు. 

దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్ సినిమా విశేషాలతోపాటు తన కెరీర్‌ గురించి దుల్కర్‌ సల్మాన్‌ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే బాలయ్య.. దుల్కర్ ను 'మీ ప్రేమకథ ఎలా మొదలైంది?' అని అడిగారు. దానికి దుల్కర్ బదులిస్తూ..' తను నా జూనియర్‌. నేను 12th చదువుతున్నప్పుడు తను ఎనిమిదో తరగతి. అప్పట్లో సరిగ్గా పరిచయం లేదు. 

Also Read : మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

13 ఏళ్ల అనుబంధం..

అప్పుడప్పుడు బయట చూస్తుండేవాడిని అంతే. చదువు పూర్తయిన అనంతరం చాన్నాళ్లకు వాళ్లింట్లోవాళ్లు అబ్బాయి కోసం వెతికారు. అదే సమయంలో నాక్కూడా సంబంధాలు చూస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఆమెకు సందేశం పంపించా. మనం ఒక్కసారి కలుద్దామని అడిగా. మూడు వారాల్లోనే మాకు నిశ్చితార్థం జరిగింది. 13ఏళ్ల అనుబంధం మాది..' అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. 

Also Read : 'పుష్ప 2' లో బిగ్ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కు పండగే

#dulquer-salmaan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe