Kaantha Teaser: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కాంత' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ విడుదల చేశారు. 1950 కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఒక హీరో, డైరెక్టర్ మధ్య జరిగే ఘర్షణ ఇతివృత్తంగా సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో కనిపిస్తూ ఇప్పటి సినిమాలకు బిన్నంగా కొత్త ఫీలింగ్ కలిగించింది. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ కథానాయికగా నటించింది. టీజర్ లో వీరిద్దరి మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే సముద్రఖని పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
Celebrate the golden age of silver screens with us. Watch the first teaser of @kaanthamovie, out now on YouTube.
— Dulquer Salmaan (@dulQuer) July 28, 2025
Tamil - https://t.co/CeblGqiDFT
Telugu - https://t.co/gqUKMsBjTH
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production.#Kaantha#DulquerSalmaan#RanaDaggubati… pic.twitter.com/3QEkvVjUzD
రానా కీలక పాత్రలో
'ద హంట్ ఫర్ వీరప్పన్' అనే నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తో పేరు తెచ్చుకున్న సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'కాంత' సెప్టెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిలిమ్స్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు రానా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.
నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో 'మహానటి', 'సీతారామం', లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు మలయాళం ఇటు తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దుల్కర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.