/rtv/media/media_files/2025/08/30/divvala-madhuri-2025-08-30-20-16-20.jpg)
Divvala Madhuri
Divvala Madhuri: బుల్లితెర ఆడియన్స్ కి బోలెడంత ఫన్, ఎంటర్ టైన్మెంట్ అందించే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో సిద్దమైంది. ఇప్పటి వరకు 8 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్స్ తో అలరించనుంది. వచ్చేనెల అంటే సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్‌లోకి దివ్వెల మాధురి
అయితే ఈసారి కంటెస్టెంట్స్ జాబితాలో రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖ వ్యక్తి పేరు కూడా వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతోంది. బోల్డ్ పర్సనాలిటీ, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు నిలుస్తుంటారు దివ్వెల మాధురి.
Divvela madhuri also confirmed for Biggboss season 9#Biggboss9Agnipariksha#BiggBossTelugu9pic.twitter.com/HXCiL3529B
— Ganesh Naidu (@ganesh_Naidu_6) August 26, 2025
అంతేకాదు తన అభిప్రాయాలను కూడా ఎంతో బలంగా, ముక్కుసూటిగా చెబుతుంటారు. గతంలో చాలా సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తుండడంతో షో మరింత వేడెక్కనున్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే దివ్వెల మాధురి ఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఒకవేళ దివ్వెల మాధురి నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే.. ఆమె ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్ ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకొస్తారు బిగ్ బాస్. ఈ సారి కూడా డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్ తో సీజన్ 9 అనౌన్స్ చేశారు. అయితే ఈసారి సెలెబ్రటీస్ తో పాటు సామాన్యులు కూడా షాలో పాల్గొంటున్నారు. అందుకే డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కామనర్స్ ఎంపిక కోసం 'అగ్నిపరీక్ష ' అనే ప్రీ-షోను నిర్వహించారు మేకర్స్.
మొత్తం 40 మంది కామనర్స్ ఈ షాలో పాల్గొనగా వారిలో నుంచి.. టాప్ 5 మందిని ఈ షో ద్వారా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ లోకి పంపిస్తారు. వివిధ రకాల టాస్క్ ల ఆధారంగా ఈ టాప్ 5ని ఎంపిక చేయడం జరుగుతుంది. దీంతో సీజన్ 9 సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. వీరి జాబితా అధికారికంగా ఇంకా పక్కటించినప్పటికీ.. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రేఖా భోజ్, సింగర్ శ్రీతేజ, బ్రహ్మముడి కావ్య శ్రీ, అలేఖ్య (చిట్టి పికిల్స్), నటి కల్పిక గణేష్, సీరియల్ నటి దేబ్జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటుడు సాయి కిరణ్, సీతాకాంత్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ కుమార్, హారిక- ఏక్ నాథ్ కపుల్, తేజస్విని గౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read:Maldives Vacation: మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్ .. ఫొటోలు చూశారా!