Director Sujeeth: మాకు ఎలాంటి గొడవలు లేవు.. OG సినిమాపై డైరెక్టర్ సుజీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

OG సినిమా ఓటీటీలో రానుండగా, దర్శకుడు సుజీత్ బడ్జెట్ రూమర్లపై స్పందించారు. నిర్మాత దానయ్యతో గొడవలన్నవన్నీ తప్పుబట్టారు. OG చిత్రం మీద ఉన్న ప్రేమకే ఇది ఫలితమని తెలిపారు. అక్టోబర్ 23న OG నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

New Update
Director Sujeeth

Director Sujeeth

Director Sujeeth:పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా "They Call Him OG"థియేటర్లలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 23, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో(OG OTT Date) స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుజీత్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి సినిమా గురించి కాదు, సినిమా వెనుక జరిగిన కొన్ని రూమర్లపై స్పందించినందుకు హైలైట్ అయ్యారు.

గత కొన్ని రోజులుగా, OG సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో సుజీత్ నిర్మాత డీవీవీ దానయ్య మధ్య కలహాలు జరిగాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, దర్శకుడు సొంత డబ్బు పెట్టేశారంటూ, తద్వారా వారు కలిసి చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ రద్దయిందన్న ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో సుజీత్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ నోట్ ద్వారా స్పందించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్ట్ సాఫీగా సాగడం ఎవరికీ ఈజీ కాలేదు. కానీ అందరం ఒకే లక్ష్యంతో OG ని గొప్పగా తీర్చిదిద్దాం" అని పేర్కొన్నారు.

నిర్మాత దానయ్యకు తన టీంకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. OG సినిమా కోసం అందరూ ఎంత శ్రమించారో గుర్తుచేశారు. సినిమా నిర్మాణం అంటే సులువు కాదని, దయచేసి ఆ ప్రక్రియను గౌరవించండి అని ఆయన అన్నాడు. ఇలా చెప్పడంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్‌కి సుజీత్ చెక్ పెట్టారు.

ఇదిలా ఉండగా, పవన్ అభిమానులు OG సినిమా ఓటీటీలో చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమన్ సంగీతం అందించారు.

ఓవర్‌ఆల్‌గా, OG ఓటీటీలోకి రావడాన్ని పురస్కరించుకుని వస్తున్న రూమర్స్‌కు సుజీత్ తగిన సమాధానం ఇచ్చారు. సినిమా థియేటర్లలో బాగా ఆడింది, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అదే స్థాయిలో స్పందన వస్తుందా చూడాలి!

Advertisment
తాజా కథనాలు