Prabhas RajaSaab: ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై మారుతి షాకింగ్ కామెంట్స్

ప్రభాస్‌- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ది రాజాసాబ్‌’ రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

New Update
Prabhas RajaSaab

Prabhas RajaSaab

Prabhas RajaSaab: ప్రభాస్‌- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజాసాబ్‌’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక అభిమాని, సినిమా రిలీజ్ డేట్(RajaSaab Release Date) పై క్లారిటీ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో  డైరెక్టర్ మారుతిని ప్రశ్నించాడు.  

అయితే ఆ అభిమాని తన పోస్ట్‌లో, " మీరు కావాల్సినంత సమయం తీసుకోండి. అవుట్‌పుట్ పై మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ‘రాజాసాబ్‌’ను రిలీజ్ చేయండి. కానీ నవంబరులోనా? వచ్చే ఏడాదిలోనా? లేదా ఇంకెప్పుడైనా? అనేది  దయచేసి మీడియా ద్వారా అధికారిక సమాచారం ఇవ్వండి. రిలీజ్ పై క్లారిటీ ఇస్తే అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు" అని పేర్కొన్నాడు.

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

కాస్త ఓపిక పట్టండి: మారుతి

అయితే దీనికి మారుతి సమాధానం ఇచ్చారు "పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ (నిర్మాణ సంస్థ) విడుదల తేదీ గురించి అధికారిక సమాచారం ఇస్తుంది. ప్రస్తుతం సీజీ వర్క్‌ వెరిఫికేషన్‌ జరుగుతోంది. సినిమా రిలీజ్ అనేది ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న విషయం. ఒక్కరి వల్ల జరిగేది కాదు. అందుకే సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టండి. మేము మీ అంచనాలను అందించేందుకు ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు.

rajasaab updates
Rajasaab Updates

 

"కొంచెం టాకీ పార్ట్‌, కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నాయి. ‘రాజాసాబ్‌’ కోసం కొన్ని సీజీఐ స్టూడియోలు ఇప్పటికే పని చేశాయి, అవి బాగా వర్క్‌ అయ్యాయి. ఇంకా ఇతర స్టూడియోలు కూడా అదే రీతిలో వర్క్‌ చేస్తాయని ఆశిస్తున్నాను. పాటల షూటింగ్స్‌ పూర్తి కాగానే లిరికల్‌ వీడియోలను విడుదల చేస్తాము. మా కష్టాన్ని మీకు చూపించేందుకు మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని చెప్పాడు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

'ది రాజాసాబ్‌'ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన ఈ సినిమాలో ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో సంజయ్‌ దత్ కన్పించనున్నారు.

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు