Balakrishna NBK111: నందమూరి బాలయ్య ఈ నెల 10న 65వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు కానుకగా.. ఈరోజు బాలయ్య 'లక్ష్మీ నరసింహా' చిత్రాన్ని రీరిలీజ్ చేయడంతో పాటు మరో అదిరిపోయే న్యూస్ చెప్పారు. బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ గోపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
''ది గాడ్ ఆఫ్ మాసెస్ తిరిగి వచ్చేస్తున్నారు.. ఈసారి మరింత బిగ్గరగా గర్జిస్తాము! రెండవ మాస్ వేడుక కోసం బాలయ్యతో కలిసి రావడం గౌరవంగా ఉంది'' అని తెలిపారు. అలాగే సినిమాను ఉద్దేశిస్తూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో ఒక సింహం మొహం మొహం కవచంతో కప్పబడి.. సగం బయటకు చూపిస్తూ ఉంది. దీంతో ఈ సినిమాలో బాలయ్య(balayya) పాత్ర చాలా శక్తివంతంగా, డెప్త్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.
THE GOD OF MASSES is back… and this time, we’re ROARING LOUDER! 🦁🔥
— Gopichandh Malineni (@megopichand) June 8, 2025
Honoured to reunite with #NandamuriBalakrishna garu for our 2nd MASS CELEBRATION together — #NBK111 👑
This one’s going to be HISTORIC! 💥
Backed by the passionate force #VenkataSatishKilaru garu under… pic.twitter.com/1bRWPX83J0
మరోసారి కాంబో రిపీట్
హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' చిత్రాన్ని కూడా ఈయనే నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే బాలయ్య- గోపీచంద్ మలినేని (gopichand-malineni) కాంబోలో వచ్చిన వీరసింహా రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్ పై కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే డైరెక్టర్ గోపీ ఇటీవలే 'జాట్' సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టాడు. నేరుగా హిందీలో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి టాలీవుడ్ డైరెక్టర్ గా గోపీ సత్తాచాటాడు.
Also Read: Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు