Delhi High Court has issued notice to Aryan Khan, Netflix, and Red Chillies Entertainment following a defamation suit by IRS officer Sameer Wankhede over the series The Ba**ds Of Bollywood*. Wankhede alleges the show has harmed his reputation and seeks Rs 2 crore in damages, to… pic.twitter.com/R5ECrYkyon
— The Daily Jagran (@TheDailyJagran) October 8, 2025
వాంఖెడే ఆరోపణలు
ఈ సిరీస్ డ్రగ్స్ నిరోధక సంస్థలను తప్పుగా, నెగిటివ్ గా చిత్రీకరించిందని, దీనివల్ల చట్టాన్ని అమలు చేసే సంస్థలపై ప్రజలకున్న నమ్మకం పోతుందని వాంఖడే ఆరోపించారు. అలాగే తన ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా ఈ సిరీస్‌ను రూపొందించారని వాదించారు.
ఆర్యన్ ఖాన్‌పై ఎన్‌డిపిఎస్ (NDPS) ప్రత్యేక కోర్టులో ఉన్న కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండగానే .. ఇలా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అలాగే సమీర్ వాంఖడే ఈ పిటీషన్ లో పరువు నష్టం కింద రూ. 2 కోట్లు నష్టపరిహారంగా కోరారు. ఆ డబ్బును క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇస్తానని తెలిపారు.
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, సినీ పరిశ్రమలో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సీరీస్ రూపొందించారు. ఈ సీరీస్ తో ఆర్యన్ ఖాన్ తొలి సారి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై దీనిని నిర్మించారు.
ఇందులో లక్ష్య, సహేర్, బాబీ దేవోల్, రాఘవ్ లీడ్ రోల్స్ లో నటించగా.. సల్మాన్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, రన్బీర్ కపూర్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ కాస్ట్ క్యామియో రోల్స్ కనిపించి అలరించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ సీరీస్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. గత నెల సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్త్రీమింగ్ అవుతోంది.
Also Read: Shriya Reddy: ‘సలార్’ కోసం రోజుకు 60 పుష్‌అప్స్.. శ్రీయా రెడ్డి వర్కౌట్ సీక్రెట్ ఇదే..!