Court Movie: ఇప్పుడు ఇంట్లోనే 'కోర్టు' డ్రామా.. ఓటీటీ డేట్ ఫిక్స్

హీరో నాని నిర్మాణంలో గతనెల విడుదలైన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

New Update

Court Movie:  హీరో నాని నిర్మాతగా ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ కోర్టు డ్రామా  'కోర్ట్: State Vs A Nobody'.  అతితక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.  రూ. 11 కోట్లతో నిర్మించగా.. విడుదలైన 3 వారాల్లోనే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కంటెంట్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా  ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. 


ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. 

latest-news | cinema-news | latest news telugu | court-movie

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు