ఫుల్ యాక్షన్ తో 'బేబీ జాన్' ట్రైలర్.. సల్మాన్ క్యామియో నెక్స్ట్ లెవెల్! వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'బేబీ జాన్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. క్రైమ్స్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. By Archana 09 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update Baby John - Trailer షేర్ చేయండి Baby John - Trailer: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బేబీ జాన్'. స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కాలీస్ తెరకెక్కిస్తున్నారు. సినీ 1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్! బేబీ జాన్ ట్రైలర్.. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో వరుణ్ ధావన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. క్రైమ్ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..! Action, fire, and unstoppable GOOD VIBES! 💥Baby John brings it all! ❤️🔥#BabyJohnTrailer out now!🔗: https://t.co/VmuQMni9dX#BabyJohn will see you in the cinemas this Christmas, on Dec 25.@MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn #WamiqaGabbi… pic.twitter.com/C0Sw1qAud3 — Keerthy Suresh (@KeerthyOfficial) December 9, 2024 సల్మాన్ ఖాన్ క్యామియో.. ట్రైలర్ లో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్యామియో రోల్లో కనిపించబోతున్నట్లు చూపించారు. కేవలం సల్మాన్ కళ్ళు మాత్రమే రివీల్ చేశారు. దీంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. Also Read: Breaking: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి