/rtv/media/media_files/2025/09/22/pranam-khareedu-47-years-2025-09-22-16-04-18.jpg)
Pranam Khareedu 47 years
Pranam Khareedu: మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా 'ప్రాణం ఖరీదు' విడుదలై నేటితో 47 ఏళ్ళు పూర్తయాయ్యి. దీంతో పాటు మెగాస్టార్ కూడా 47 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తనను అనుక్షణం ఆదరించి, అభిమానించిన తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని తెలిపారు. ఈ 47 ఏళ్లలో నేను పొందిన అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు! మీ అందరివీ, మీరందించినవి అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
22 సెప్టెంబర్ 1978
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz
'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ సినిమాతో మరో లెజెండ్రీ నటుడు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన మరెవరో కాదు.. బహుముఖ ప్రజ్ఞాశాలి, విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు. చిరంజీవి, కోట ఇద్దరూ కూడా 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తమ సినీ కెరీర్లు ప్రారంభించారు. ఇందులో కోట ఒక చిన్న పాత్రలో నటించారు.
మెగాస్టార్ ఫస్ట్ రెమ్యునరేష్..
తొలి సినిమాకు చిరంజీవి కేవలం రూ. 1,116 పారితోషికం అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగారు. భారతీయ సినిమాలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరో కూడా ఆయనే. 1992లో విడుదలైన 'ఆపద్బాంధవుడు' సినిమాకు చిరంజీవి రూ.1.25 కోట్లు రెమ్యునరేషన్ పొందారట. కెరీర్ ప్రారంభించిన 5 ఏళ్లలోనే తన నటన నైపుణ్యంతో రూ. 1,116 నుంచి రూ.1.25 కోటి తీసుకునే స్థాయికి ఎదిగారు.
ప్రాణం ఖరీదు చిత్రాన్ని సి.ఎస్.రావు రచించిన నాటకం ఆధారంగా కె. వాసు తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించగా .. చంద్రమోహన్, మాధవి, కోట శ్రీనివాస్ రావ్, రావు గోపాల్ రావు ముఖ్య పాత్రలు పోషించారు. కె. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మెగాస్టార్ ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. 47 ఏళ్ల సినీ కెరీర్ లో 155 కి పైగా చిత్రాలతో అభిమానులను అలరించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ 4 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, మన శంకర వరప్రసాద్, # చిరు ఓదెల, #చిరు బాబీ2 సినిమాలు చేస్తున్నారు. వీటిలో # చిరు ఓదెల, #చిరు బాబీ2 ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళానున్నాయి.
Also Read: Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!