ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. ఇటీవల జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగపెట్టుకున్న ఆయన తల్లి బీబీజాన్కు శనివారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బీబీజాన్కు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స జరగుతోంది. సమాచారం తెలుసున్న జానీ మాస్టర్ సతీమణి అయేష కూడా ఆస్పత్రికి వెళ్లారు. అత్త ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె అడిగి తెలుసున్నారు. బీబీజాన్ ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.