Vishwambhara: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వంభర నుంచి ఆడిపోయే అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:06 నిమిషాలకు మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే సినిమా ఆలస్యానికి గల కారణాలను వివరించారు మెగాస్టార్. ''సినిమాలోని సెకండ్ ఆఫ్ అంతా కూడా గ్రాఫిక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా అత్యత్తమైన గ్రాఫిక్స్ అందించే ప్రయత్నమే సినిమా ఆలస్యానికి కారణమని చెప్పారు. 'విశ్వంభర' ఒక అందమైన చందమామ కథలా సాగే చిత్రమని, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉండబోతుందని తెలిపారు.
Bringing #Vishwambhara to the theatres in SUMMER 2026.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 21, 2025
Enjoy the #MEGABLASTTEASER today at 6:06 PM 🤗 https://t.co/nzRrp8gqBF
గ్రాఫిక్స్ ప్రధానం
'బింబిసారా' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గతంలో సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా.. అందులోని గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఏ మాత్రం నాణ్యత లేని గ్రాఫిక్స్ ఉపయోగించారని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. దీంతో ప్రేక్షకులకు అత్యుత్తమ గ్రాఫిక్స్, విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం ఇంటర్ నేషనల్ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేస్తున్నారు. ఒక సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత ఈ జంట మళ్ళీ కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. 2006లో స్టాలిన్ సినిమాలో త్రిష- చిరంజీవి కలిసి నటించారు. ఆషికా రంగనాథ్, . కునాల్ కపూర్, ఇషా చావ్లా, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 100 మంది డాన్సర్లు, మౌని రాయ్ గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. భీమ్స్ మ్యూజిక్ లో చిరు, మౌనిరాయ్ థియేటర్‌లో ఫుల్ జోష్ నింపనున్నారు.
Also Read: Venu Swamy: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు.. కామాఖ్యా ఆలయంలో షాకింగ్ ఘటన!