Mana Shankara Vara Prasad Garu: మెగా విక్టరీ.. బాక్సఫీస్ దుమ్ముదులిపిన 4th డే కలెక్షన్స్..

సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల గ్రాస్ సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ తో రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

New Update
Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu: సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి ఆట నుండే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతోంది.

నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇవాళ్టితో రూ.200 కోట్ల మార్క్ కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సినిమా బాగా ఆడుతోంది. వీకెండ్ రావడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవి(Chiranjeevi) ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కుటుంబంతో కలిసి చూసే సినిమాగా మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా వర్క్ అవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సీన్స్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్, హర్ష వర్ధన్, జరినా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రత్యేక పాత్రలో కనిపించి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఎంట్రీ థియేటర్లలో చప్పట్లు కురిపిస్తున్నాయి. కేథరిన్ ట్రెసా కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు బాగా సెట్ అయింది.

మొత్తంగా సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా థియేటర్లకు తీసుకువస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ దూకుడు ఇంకా కొన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు