Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయి: చిరంజీవి!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంపై మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

New Update

Chiranjeevi: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బుధవారం కేటీఆర్‌ పై విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ కి చెందిన నాగచైతన్య, సమంతలని ఉద్దేశించి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబంతో పాటు స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, నాని వంటి వారు కూడా తీవ్రంగా స్పందించారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు వల్ల నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు అయిన విషయం. మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. 

I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister.

It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024

సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాం అంతేకాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దాన్ని కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా,ఆదర్శంగా ఉండాలి. దీనికి సంబంధిత వ్యక్తులు ఈ హానికరమైన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి అని అన్నారు. దీంతో మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ, సమంత, ఎన్టీఆర్, నాని, కోన వెంకట్.. చాలా మంది సినీ ప్రముఖులు స్పందించగా ఇప్పుడు మెగాస్టార్ కూడా రిప్లై ఇవ్వడంతో ఈ ఇష్యూ పై సినీ పరిశ్రమ మరింత ఫోకస్ అయ్యేలా ఉంది.

Also Read: నస్రల్లా అల్లుడు కూడా మృతి!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe