RGV Post:   చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై.. RGV సంచలన ట్వీట్!

వివాదాస్పద దర్శకుడు డైరెక్టర్ ఆర్జీవీ తరచు ఏదో ఒక విషయంపై నెట్టింటి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

New Update
RGV Post on Chiranjeevi and Pawan Kalyan

RGV Post on Chiranjeevi and Pawan Kalyan

RGV Post: వివాదాస్పద దర్శకుడు డైరెక్టర్ ఆర్జీవీ తరచు ఏదో ఒక విషయంపై నెట్టింటి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే  చిరంజీవి తొలి సినిమా 'ప్రాణం ఖరీదు' విడుదలై 47 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అలాగే అన్నయ్యతో ఉన్న  కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టును ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆర్జీవీ చేసిన ట్వీట్ ఏంటో ఇక్కడ  తెలుసుకోండి.. 

RGV ట్వీట్

మీరు  ఇద్దరూ(చిరంజీవి, పవ కళ్యాణ్)  కలిసి సినిమా చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మెగా పవర్ ఫేవర్ చేసినవారవుతారు! అంతేకాదు అది శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు 'మరి ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు?'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

47 ఏళ్ల సినీ ప్రస్తానం

ఇదిలా ఉంటే మెగాస్టార్ సినీ ప్రస్తానం మొదలై కూడా 47ఏళ్ళు పూర్తయింది. ప్రాణం ఖరీదు సినిమాతోనే చిరు సినీ కెరీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అభిమానుల ప్రేమ, అభిమానాలే తనను ఈరోజు మెగాస్టార్ చేశాయని, ఇప్పటివరకు తాను పొందిన అవార్డులు, సన్మానాలు సత్కారాలు తనవి కాదని అభిమానులు తనకు అందించినవని కృతజ్ఞతలు తెలియజేశారు. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో 155 కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు మెగాస్టార్. 

ప్రాణం ఖరీదు చిత్రంలో  చిరంజీవి హీరోగా నటించగా .. చంద్రమోహన్, మాధవి, కోట శ్రీనివాస్ రావ్, రావు గోపాల్ రావు ముఖ్య పాత్రలు పోషించారు. తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు చిరు. ఇంక ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ విజయాలతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 

Also Read: Ticket Rates: సినిమా టికెట్ రేట్ల రగడ.. రూ. 200 పరిమితిపై హైకోర్టు సంచలన తీర్పు!

Advertisment
తాజా కథనాలు